జర్నలిస్టుల కుటుంబాలకు సిద్దార్థ చేయూత

జర్నలిస్టుల కుటుంబాలకు ఆసరా

ఎన్బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదుగురికి రూ.10వేలు చొప్పున రూ.50వేలు ఆర్ధిక సాయం
దాతృత్వాన్ని చాటుకున్న నల్లమోతు సిద్దార్ధ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకుంటామని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తనయుడు, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పేర్కొన్నారు. కరోనా బారినపడి ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన ఐదుగురు జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.50 వేలు ఆర్ధిక సాయాన్ని యువనేత అందజేశారు. నల్లమోతు సిద్దార్ధ నిర్ధేశానుసారం కోవిడ్ బారినపడి కోలుకున్న జర్నలిస్టులను, కుటుంబసభ్యులను హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హామీద్ షేక్ పరామర్శించారు. అనంతరం సిద్దార్ధ పంపిన ఆర్ధిక సాయాన్ని అందజేశారు.

కరోనా మహమ్మారి బారినపడి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 20 మంది జర్నలిస్టులకు గతనెలలో రూ.10వేలు చొప్పున రూ.2 లక్షలు, తాజాగా, రెండో విడత ద్వారా మరో ఐదుగురికి రూ.10వేలు చొప్పున రూ.50వేలు ఆర్ధిక సాయాన్ని నల్లమోతు సిద్దార్ధ అందజేశారని హమీద్ షేక్ తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించే జర్నలిస్టులకు ఆర్థికసాయం అందజేస్తూ సిద్దార్ధ మనోధైర్యం కల్పించడం అనిర్వచనీయమని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో తమకు అండగా నిలిచిన నల్లమోతు సిద్దార్ధకు జర్నలిస్టులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *