జర్నలిస్ట్ కుటుంబానికి మైనంపల్లి చేయూత

జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన మైనంపల్లి

-రూ.2లక్షల వ్యక్తిగత సహాయం
-పిల్లల చదువు బాధ్యత
-డబుల్ బెడ్ రూం ఇల్లుకు హామీ

-కృతజ్ఞతలు తెలిపిన టీయూడబ్ల్యూజే

మల్కాజ్ గిరి, అక్షిత ప్రతినిధి :నిన్న హఠాత్తుగా గుండెపోటుతో నేలకొరిగిన మల్కాజ్ గిరి పాత్రికేయుడు శ్రీనివాస్ కుటుంబాన్ని ఇవ్వాళ స్థానిక శాసన సభ్యులు మైనంపల్లి హన్మంత రావు టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంబానికి తన సానుభూతి తెలిపి ఓదార్చారు. మృతుడు శ్రీనివాస్ పిల్లలిద్దరికి చెరో లక్ష రూపాయల చొప్పున మైనంపల్లి తన వ్యక్తిగత ఆర్థిక సహకారాన్ని ప్రకటించారు. దీంతో పాటుగా ఇద్దరు పిల్లల చదువు బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. టీయూడబ్ల్యూజే విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ తో మాట్లాడి డబుల్ బెడ్ రూం ఇల్లును మంజూరీ చేస్తానని భరోసానిచ్చారు. మృతుని భార్యకు ఏదేని ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడతామని ఎమ్యెల్యే హామీ ఇచ్చారు. జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబానికి పెద్ద దిక్కులా నిలిచిన మైనంపల్లి హన్మంత రావుకు టీయూడబ్ల్యూజే నేత విరాహత్ అలీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా శాఖ అధ్యక్షుడు మోతె వెంకట్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బాల్ రాజ్, సహాయ కార్యదర్శి వెంకటేష్, యూనియన్ కాప్రా, మల్కాజిగిరి నాయకులు విజయ్, తేజ, మహేష్, లక్ష్మారెడ్డి, మల్లేష్ గౌడ్, పవన్, మనోహర్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *