జయశంకర్ జీవితం… ఆదర్శం

స్వరాష్ట్ర స్వాప్నికుడు… జయశంకర్

 డాక్టర్ మునీర్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
సమాజంలో ప్రతి మనిషి తన సొంతానికి కాకుండా సమాజానికి కూడా సహాయం చేయడం ద్వారా గుర్తింపు లభించడంతో పాటు వారి సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలంగాణ హెల్పింగ్ హాండ్స్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ అన్నారు శుక్రవారం నల్లగొండ జిల్లా హెల్పింగ్ హాండ్స్ శాఖ ఆధ్వర్యంలో మిర్యాలగూడ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రొఫెసర్ జయశంకర్ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి,కొవ్వొత్తులు వెలిగించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా మునీర్ మాట్లాడుతూ తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసి స్వరాష్ట్ర సాధనకు మార్గం సుగమం చూసిన మహనీయులు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని వాని ఆశయ సాధన ఫలితంగానే స్వరాష్ట్రం సిద్ధించిందని వారి సేవలను ప్రతి తెలంగాణ పౌరుడు గుర్తుపెట్టుకోవాలని అదేవిధంగా యువత మంచి నడవడికతో సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో పొగుల సందీప్ ,పగిల్ల కళ్యాణ్, యాదగిరి, గోపి,కార్తీక్, శంకు యాదవ్, శ్రీనివాస్ రెడ్డి,పాపయ్య, రోహిత్,సాయి,శివ శంకర్, మదీహ ఫాతిమా, ఫరోజా,షాహీదా,శ్వేతా, రూబీన,రూహీన తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *