జల దోపిడిని అడ్డుకుందాం

 

టిజేఎఫ్ సమావేశంలో ముక్తకంఠంతో వివిద రాజకీయపార్టీలు, ఉద్యమ సంస్థల నేతలు

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
కృష్ణా జిల్లాల నీటి కేటాయింపులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, జల దోపిడీపై వివిధ రాజకీయ పక్షాలు, ఉద్యమ సంస్థలు, ప్రజాసంఘాలు గలమెత్తాయి. రాష్ట్ర సాధన కోసం ఉద్యమస్ఫూర్తిని కొనసాగించిన తరహాలోనే న్యాయమైన నీటి వాటా కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర సమాజాన్ని ఏకతాటి పైకి తీసుకు వచ్చింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో టీ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్ అధ్యక్షతన ‘కృష్ణా ‘జలాలు న్యాయమైన వాటా- పెండింగ్ ప్రాజెక్టులు సత్వరం పూర్తి’ అనే అంశంపై వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు, ఉద్యమ సంస్థల నాయకులతో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ జానసమితి అధ్యక్షులు ప్రోఫెసర్ ఎం.కోదండరాం, తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, ఎంపీ, బిజెపి నేత వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ, బిజెపి నాయకులు జితేందర్ రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ శాసనసభ్యుడు సంపత్ కుమార్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఐ నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు, బాల మల్లేష్, అరుణదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ సలహాదారుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు సిలివేరు కాశినాధం, తెలుగు మహిళా అధ్యక్షురాలు ప్రొఫసర్ జ్యోస్నా, మాజీ రిటైడ్ చీఫ్ ఇంజినీర్ ఎం. సత్తిరెడ్డి, ఇంజినీర్స్ ఫోరమ్ కన్వీనర్ డి. లక్ష్మీనారాయణ, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు అంబటి నాగయ్య, జై స్వరాజ్ పార్టీ అధ్యక్షులు కాసాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సర్కార్ ఒంటెద్దు పోకడలను ఎండగట్టాయి. తెలంగాణ ఏర్పాటులో నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 అంశాలు ట్యాగ్ లైన్ గా ఉద్యమాలు సాగాయి. ఈ మూడింటిలో ప్రధానమైన నీటి కేటాయింపుల అంశం ఇంకా వివాదాస్పదంగా నే కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని చెప్పిన మాటలన్నీ కల్లబొల్లి కబుర్లు గానే మిగిలిపోయాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పేరుతో అక్రమ ప్రాజెక్టును చేపట్టినా.. ఈ ప్రాజెక్టు సంబంధించిన గ్రౌండ్ వర్క్ గత ఏడాది కాలంగా సాగుతున్నా.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ వ్యవహార శైలిని అఖిలపక్షం నాయకులు ముక్త కంఠంతో ఖండించారు. టీ. జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు పల్లె రవికుమార్ సాగునీటి కేటాయింపుల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అఖిలపక్షం ముందుంచారు. నీళ్ల కోసం తెలంగాణ సమాజం తెల్లారిందో ఆ నీళ్లు ఎందుకు పోతుంటే సర్కారు చూస్తూ కూర్చుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని… తండాలోని పిల్లలు అమ్మకాలు ఆగుతాయి అనుకున్నామని, సీఎం కేసీఆర్ తో ఏ ఒక్కటి సాకారం కాలేదని విమర్శించారు. కృష్ణా నది తెలంగాణలో 68 శాతం 32 శాతం ఇస్తున్నప్పటికీ నా వాటా కేవలం 290 ఎంసీ లేనని.. ఆంధ్రోళ్లు నీటిని తరలించే పోతున్నప్పటికీ తెలంగాణ సర్కారు చూస్తూ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మన నీటి కేటాయింపుల అవసరాలకు అనుగుణంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ సమాజానికి స్పష్టం చేశారు. ఎస్.ఎల్.బి.సి లాంటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేసుకోకపోతే మనం సాధించుకున్న తెలంగాణ ఎందుకు అని పల్లె రవికుమార్ ప్రశ్నించు కోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.

**టీ జే ఎస్ అధ్యక్షుడు కోదండరాం**

పోలవరం విస్తరణను ఆపాలని ఆనాడు మీటింగ్ పెట్టాం… ఇపుడు ఆరోజు ఒక రాజకీయ అవసరం నడిపిస్తే ఈరోజున వేరే అవసరం ఉన్నట్లుండి.. అంతే కానీ నీటి వాటాలో అసమానతలు ఎక్కువయ్యాయి.. కానీ తెలంగాణ వచ్చాక అయిన పరిస్ధితులు మారుతయంటే అది లేదు… శ్రీశైలం నుండి నుండి నీళ్లు తీసుకోవచ్చు… కల్వకుర్తి పెంచుకోండి అంటే ప్రాజెక్ట్ రే డిజైన్ చేయడం కుదరదు అన్నారు .

ఇవాళ ప్రభుత్వము దివాలా తీసింది. ఈరోజు తెలంగాణ ప్రాజెక్టు లని డిజైన్ చేసేది ఇంజినీర్లు కాదు…ఆ బాధ్యత మేఘా కృష్ణరెడ్డి మాత్రమే..
తెలంగాణ ప్రాజెక్టు నిర్మిచేది ఇక్కడి వాళ్ళకె దక్కాలని డిమాండ్ చేద్దాం. మన వాటా ను మనం సమర్థవంతంగా వినియోగించుకోవడానికి కృష్ణ మీద ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయండి.

ఎస్ ఎల్ బి సీ నీ పూర్తి చేయాలి
దీనిని సీఎం గుర్తిస్తారు అని అనుకోవడం లేదు .. వీటిపై పోరాటాలు చేయాలి.

జూరాల నుంచి పాలమూరు రెండో పాయ కోసం మళ్లీ పోరాడాలి.
తెలంగాణ కెసీఆర్ గడీ లో బంధీ అయిపోయింది… దీనిని కాపాడుకోవాల్సిన మన అందరిపై ఉంది..

*వివేక్ వెంకటస్వామి…

కృష్ణా నీటి వాటలపై ఇంత అన్యాయం జరుగుతున్న కేసీఆర్ గమ్మున ఉండటానికి కమిషన్ కారణం. ఆయనకు కళ్లు నెత్తి మీదికెక్కినయి. జగన్ ని ఇంటికి పిలిపించుకుని ఆనాడు చర్చలు జరుపుకున్నారు. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు. మేఘ కృష్ణారెడ్డి 36 వేల కోట్ల కాంట్రాక్టు లక్షకు పైగా పెంచారు.

 

*బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి**

కెసిఆర్ కి అధికారం ఇవ్వటమే తెలంగాణ ప్రజలు చేసిన పెద్ద తప్పు

ఆయనకి కుటుంబ పాలనపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదు…

824 టీఎంసీల నీళ్లు తీసుకుపోతున్నారు అని తెలిసి ఏపీ సీఎం కి పార్టీ ఇచ్చావని కేసీఆర్ ను విమర్శించారు.

కృష్ణా జలాల వివాదం పై ఏ ఒక్క రోజైనా కేంద్ర ప్రభుత్వం తో కలిసి చర్చించావా అని కేసీఆర్ ను ప్రశ్నించారు.

*పాశం యాదగిరి సీనియర్ జర్నలిస్ట్…*
ఇప్పుడు అందరూ కలిస్తేనే ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవచ్చని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అన్నారు. పాలకులకు బుద్ధి ఉండాలని, తెలంగాణలో రక్తం ఏరులై పారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

*దొంతుల లక్ష్మీనారాయణ తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం కన్వీనర్*

తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడంలో సీఎం కేసీఆర్ తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం కన్వీనర్ దొంతుల లక్ష్మీ నారాయణ విమర్శించారు. తెలంగాణ వచ్చేనాటికే 97 లక్షల 55 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాజెక్టులు, ప్రస్తుత ప్రాజెక్టుల పరిస్థితులపై అధ్యయనం చేసిన ఆయన.. నేటి వరకు కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులపై తెలంగాణ నేటి వాటాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

 

శాసనమండలి మాజీ చైర్మన్ స్వామీ గౌడ్

తెలంగాణ జర్నలిస్ట్ ఫోరానికి అభినందనలు తెలిపారు.

ఆనాడు తెలంగాణ ఉద్యమం లో కోరిన కోరికలు ఈనాడు స్వరాష్ట్రలో నెరవేరడం లేదు…

ఇరిగేషన్ మాత్రమే కాకుండా, పోడు సమస్యలు, నిరుద్యోగుల సమస్యలపై మనం దృష్టి సారించాలి.

ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది ఏంటంటే కెసీఆర్ చేసిన అన్యాయం ప్రతీ ఒక్కరిలో కనిపిస్తుంది

*మల్లురవి…కాంగ్రెస్ నేత*

రాష్ట్రంలో ప్రభుత్వం అవినీతి మయంలో కొనసాగుతోంది. చివరకు నీళ్ల పంపకాల విషయంలో సీఎం పట్టించుకోవడం మానేశాడు. రాష్ట్రంలో ఎవరు మాట్లాడకుండా చేస్తున్నారు. ఎం కార్యక్రమాలు చేయాలన్న వాళ్ళ పర్మిషన్ తీసుకొనే పరిస్థితి వచ్చింది.

కాంగ్రెస్ పార్టీ.. వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేసిన పార్తి కాదు. ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేసింది. కార్యచరలో వందలాది మందిని కోల్పోయిన పార్టీ మాది.

*శ్రావణ్. ఏఐసిసి అధికార ప్రతినిధి*

నర్సులు ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నావారిని ఇవ్వాళ అరెస్ట్ చేస్తారా..సిగ్గుందా? 300 కోట్లు జగన్ గెలిపించు కోవడానికి డబ్బులు పంపాడు. రాజకీయ, ఆర్ధిక లబ్ది పొందెదుకు కేసీఆర్ నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు.

ఇద్దరు కూడా డ్రామా ఆడుతున్నాడు. నీళ్ల పంచాయితీ కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నం జరుగుతోంది. దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది.

*చెరుకు సుధాకర్, ఇంటిపార్టి అధ్యక్షుడు*

వైఎస్ కు హారతి పట్టే సన్నాసులా మాకు నీతులు చెప్పేది అన్న సీఎం కెసిఆర్ ఇపుడు చేస్తున్నదేమిటి..

వందల మంది జీవితాలు జైల్లో మగ్గి, ఆత్మ బలిదానాలు చేస్తే ఈరోజు తేరగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు..

బేసిన్ లు, బేసజాలు లేవన్న సీఎం కెసిఆర్ దిష్టి బొమ్మను రోడ్లపై తగలబెట్టాలి.

 

**కాంగ్రెస్ నేత సంపత్**

ప్రాజెక్టుల విషయలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

సెంటిమెంట్ రగిలే తెలంగాణ లో కంచెనే చేను మేస్తే అన్న చందంగా రాజకీయ ప్రయోనాలకోసం ఎత్తుగడలను వేస్తున్నారు సీఎం కెసిఆర్

రెండిట్లో విఫలమైంది… అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామన్న హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు.

దక్షిణ తెలంగాణా ఎడారైపోతుందే చూడలేక కేంద్రం జలశక్తి శాఖకు లేఖ ఇచ్చాం… కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అభ్యంతరం కేంద్రానికి ఇవ్వలేదు…

 

*జ్యోష్ణ.. టీటీడీపీ మహిళ అధ్యక్షురాలు*

ప్రజల మధ్య చిచ్చుపెట్టి.. ఆవేడిలో కాగలని వీళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. కేసీఆర్ ద్వంద నీతిని అవలభిస్తున్నాడు. ఉద్యోగాల కోసం ఏడాదిలో 7 గురు చనిపోయారు. 50 మంది 6 ఏళ్లలో చనిపోయారు. అయిన వీళ్ళ మనసు కరగడం లేదు.

*గోవర్ధన్. న్యూ డేమోక్రసి*

జర్నలిస్ట్ లను సైతం ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా అడ్ఫుకుంటున్నారు. సెంటిమెంట్ రెచ్చగొట్టి లబ్ది పొందాలని కెసిఆర్ చూస్తున్నారు.

*బాల మల్లేష్, సిపిఐ కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు..

కృష్ణజలాల వాటా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ నేత బాల మల్లేష్ అన్నారు.

*కాసాని శ్రీనివాసరావు, జై స్వరాజ్ పార్టీ అధ్యక్షులు..*

తెలంగాణలోని అన్ని పార్టీల నేతలందరూ సీఎం కేసీఆర్ వద్ద నెల నెల జీతాలు తీసుకునే జీతగాళ్లు, ఈ దొంగలేనని జై స్వరాజ్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు విమర్శించారు.

*సిపిఎం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి.*

కేంద్రం తన వైఖరిని ప్రకటించకుండా సమస్యను మరింత జఠిలం చేస్తోందని నరసింహారెడ్డి వాపోయారు. శ్రీశైలం ఎడమ కాలువ, తెలుగుగంగ ప్రాజెక్టులను ఒకేసారి ప్రారంభించిన కూడా ఇంకా తెలంగాణలోని ప్రాజెక్టులు పూర్తి కావడం లేదన్నారు.

*గవినోల్ల శ్రీనివాస్, సామాజిక ఉద్యమకారుడు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో చేసి వేసిన వ్యక్తి…*

ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీళ్లు తరలించుకు పోతుంటే.. పాలమూరు జిల్లా పూర్తిగా ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.

*గోవర్ధన్, సిపిఐఎంఎల్, న్యూడెమోక్రసీ నాయకులు..*

తెలంగాణ, ఏపీ మంత్రులు రెండు రాష్ట్రాల ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే పనిలో ఉన్నారని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు అన్నారు. కేంద్రం కూడా ఇదే ధోరణితో వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు.

*సత్తిరెడ్డి, తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్..*

2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు నీటి పంపకాలు జరగాలని,ఈ విషయం రాష్ట్ర విభజన చట్టంలో కూడా ఉందని ఇంజినీర్స్ అసోసియేషన్ నేత రెడ్డి గుర్తుచేశారు.

*లింగయ్య, కల్వకుర్తి ఎత్తిపోతల జల సాధన సమితి కన్వీనర్..*

పోతిరెడ్డి పాడు ద్వారా తెలంగాణకు పూర్తి అన్యాయం జరుగుతుందని కల్వకుర్తి ఎత్తిపోతల సాధన సమితి నేత లింగన్న అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు పల్లె రవికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సతీష్ కమాల్, రాష్ట్ర కార్యదర్శులు కోడికంటి శ్రీనివాస్, సిద్ధగౌని సుదర్శన్, పాలకూరి రాజు, సంయుక్త కార్యదర్శులు ముద్దం స్వామి, పోగుల ప్రకాష్, గజ్జెల నగేష్ గౌడ్, నాయకులు కుమార స్వామి, బర్ల శ్రీనివాస్, వీరమళ్ళ రమేష్, పోలగోని శ్రీధర్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

*అఖిలపక్ష సమావేశంలో పాల్గొని, ప్రతిపాదించిన తీర్మానాలు…*
1) పరివాహక ప్రాంత దామాషా ప్రకారం తెలంగాణ వాటా కృష్ణా నది నుండి దక్కాలి.
2) నది జలాల పంపకంపై అంతర్జాతీయ, జాతీయ సంస్థల ఆధారంగా తొలుత పరివాహక ప్రాంత అవసరాలు తీరిన తర్వాతనే ఇతర ప్రాంత అవసరాలకు వినియోగించాలి. పరివాహక ప్రాంతంలోని వెనుకబడిన జిల్లా పాలమూరు ఫ్లోరైడ్ పీడిత జిల్లా నల్లగొండ, రంగారెడ్డి ఆకలిచావులు ఆత్మహత్యలు నివారించకుండా.. మనుషులు పశువులు చిక్కం గట్టి ఏపీకి తరలించే దుర్మార్గాన్ని అరికట్టాలి.
3) కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.
4) కాసులు, కాంట్రాక్టులు రాజకీయ అవసరాల ఆధారంగా ప్రాజెక్టును రూపొందించకుండా ప్రజా ప్రయోజనాల ఆధారంగా ప్రాజెక్టులు రూపొందించి పూర్తి చేయాలి.
5) నదీజలాల్లో వాటాను సాధించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులు, అదేవిధంగా తెలంగాణ ప్రాజెక్టులు కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేయాలి.
6) రాష్ట్ర ప్రాజెక్టులు, జలాల విషయంలో తెలంగాణలోని రాజకీయ పార్టీలు, ఉద్యమ సంస్థలను కలుపుకుని కేంద్ర ప్రభుత్వంపై వెంటనే ఒత్తిడి చేయాలి. నీటి పంపకాల విషయంలో ప్రజలమధ్య వైరుద్యాలు పెరుగకుండా రెండు ప్రాంతాల ప్రజాస్వామిక వాదులతో సహృదయ కమిటీని వేసేలా ప్రయత్నిద్దాం..
7) ఆంధ్ర ప్రదేశ్ కాంట్రాక్టర్లు, ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కుమ్మక్కయిందనే అనుమానాలను వెంటనే నివృత్తి చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *