సమతావాది… పాలనా దక్షుడు

జగ్జీవన్ సేవలు చిరస్మరణీయం
యాతాకుల రాజన్న మాదిగ

సూర్యాపేట, అక్షిత బ్యూరో : సమతావాది… గొప్ప పాలనా దక్షుడుగా దేశానికి విశిష్ట సేవలందించిన మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం సేవలు చిరస్మరణీయమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ఇంచార్జీ యాతాకుల రాజన్న మాదిగ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, సమతావాది మన పాలన దక్షతతో దేశానికి విశేష సేవలందించిన భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 35 వ వర్ధంతిని పురస్కరించుకొని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి యాతాకుల రాజన్న మాదిగ మాట్లాడుతూ దళిత బహుజనుల హక్కులకు, అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించి ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి భారత ఉప ప్రధాని వరకు అనేక సేవలందించిన మహానీయులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. సమానత్వం కోసం సమత వాదిగా పోరాడిన మహా నాయకుడు, కాని ఆయన కలలుగన్న ఈ దేశంలో దళిత బహుజనులను ఓటేసే యంత్రాలు లాగానే వాడుకుంటున్నారన్నారు. దళితుల హక్కులను తుంగలో తొక్కి తెలంగాణ రాష్ట్రంలో దళిత వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్నారన్నారు.గత ఏడేళ్లుగా దళిత బహుజనులను మోసం చేస్తూ దళితులకు 3 ఎకరాల భూమి, ముఖ్యమంత్రి పదవి దళిత మాయమాటలతో మోసం చేసి ప్రస్తుతం దళిత సాధికారిత పేరుతో మరొసారి మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ కుటిల రాజకీయాలను చేస్తున్నారన్నారు. కేసిఆర్ దుర్మార్గమైన ఆలోచనలను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు గమనించి, కేసిఆర్ మోసపూరిత పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ చింతలపాటి చిన్న శ్రీరాములు, ఎమ్మార్పీఎస్ నాయకులు బోడ శ్రీరాములు మాదిగ, దాసరి వెంకన్న మాదిగ, బహుజన వాది బత్తుల వెంకన్న గారు, ఎమ్మార్పీఎస్ నాయకులు, చెరుకుపల్లి చంద్రశేఖర్ మాదిగ, ఖమ్మంపాటి రమేష్ మాదిగ, ముల్కలపల్లి మల్లేష్ మాదిగ, గారా కనకయ్య మాదిగ, దైద వెంకన్న మాదిగ కత్తి రవి మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *