ఏపీలో మంత్రులపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉంది.. జాగ్రత్తగా ఉండండి

ఏపీలోని పలువురు మంత్రులపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు బీజేపీ ఆడిస్తున్న నాటకమేనని చెప్పారు. ఈ నాటకాన్ని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. సంచలనం కోసమే అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు హత్య చేశారని తెలిపారు. ఇకపై ప్రతి నెల మంత్రులు, అధికారులపై సమీక్షను నిర్వహిస్తానని చెప్పారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ మేరకు చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Tags: IT rides,andhra pradesh,ts bjp party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *