IPL 2021 వేలం..

ఇంటర్నెట్ డెస్క్: గురువారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 మినీ వేలం రసవత్తరంగా సాగింది. వేలంలో ఉన్న కొందరు ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలన్నీ పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే కొందరు ఆటగాళ్ల కోసం కోట్లకు కోట్లు కుమ్మరించాయి. మరికొందరు స్టార్ ప్లేయర్లను కేవలం లక్షల ఖర్చుతోనే సొంతం చేసుకున్నాయి. అయితే ఈ మినీ వేలంలో ఏ ఫ్రాంచైజీ ఎంత నగదుతో బరిలోకి దిగింది..? వేలంలో ఎంతమేర ఖర్చు చేసింది..? ఎంతమంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది..? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

మొత్తం ఐపీఎల్ ఫ్రాంచైజీలు: 8

మొత్తం వేలంలో ఖర్చయిన సొమ్ము: రూ.145.3 కోట్లు

కొనుగోలు చేసిన మొత్తం ఆటగాళ్లు: 57

అత్యధిక ధర పలికిన ఆటగాడు: క్రిస్ మోరిస్-సౌత్‌ఆఫ్రికా, రూ.16.25 కోట్లు(ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం), రాజస్థాన్ కొనుగోలు చేసింది.

అత్యధికంగా ఖర్చు చేసిన ఫ్రాంచైజీ: ఆర్సీబీ, రూ.35.05 కోట్లు

అత్యధికమంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఫ్రాంచైజీ: పంజాబ్ కింగ్స్-9 మంది ఆటగాళ్లు, రూ.34.40 కోట్లు ఖర్చు చేసింది. ఇక ఆర్సీబీ, రాజస్థాన్, కోల్‌కతా, ఢిల్లీ ఫ్రాంచైజీలు ఒక్కొక్కటీ 8 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *