ఇంటీరియర్స్ దుకాణంలో అగ్నిప్రమాదం

శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి : వివేకానందనగర్ డివిజన్ ఆల్విన్ కాలనీ కేఎల్ బార్ చౌరస్తాలో ఫ్యాబ్రికేషన్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది .సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. బాధిత కుటుంబాలను షాపు యజమానులు పరామర్శించిన జగద్గిరిగుట్ట సీఐ సైదులు,ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్, మరియు కార్పొరేటర్ మాధవరం రోజు దేవి రంగారావు, ఈ సందర్భంగా కార్పొరేటర్ రోజా దేవి మాట్లాడుతూ ఈరోజు ఉదయం కమలప్రసన్న నగర్ లో ఫ్యాబ్రికేషన్ షాప్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని అన్నారు. బిల్డింగ్ యజమానిని మరియు షాప్ యజమానులను కలిసి వివరాలు అడిగి తెలుసుకోని వారిని ఓదార్చడం జరిగింది. అదేవిధంగా మంటలు అదుపు చేసిన పోలీస్ సిబ్బందికి, అగ్నిమాపక సిబ్బందికి, డి ఆర్ ఎఫ్ టీమ్ కి ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *