ముగిసిన టీమిండియా ఫస్ట్ ఇన్సింగ్స్

సౌతాంప్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత తొలి ఇన్సింగ్స్ ముగిసింది. మూడో రోజు 146/3తో తొలి ఇన్సింగ్స్ ప్రారంభించిన ఇండియా 217 పరుగులకు ఆలౌట్ అయింది. ఆట ప్రారంభమైన కాసేపటికే కోహ్లీని అవుట్ చేసి భారత్‌ను దెబ్బకొట్టిన జెమీసన్ ఆ తర్వాత మరింత చెలరేగిపోయాడు. వరుసపెట్టి వికెట్లు తీస్తూ భారత్‌కు కష్టాల్లోకి నెట్టేశాడు. మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టి టీమిండియా ఇన్సింగ్స్‌ను శాసించాడు. కివీస్ బౌలర్ల నిప్పులు చెరిగే బంతులకు ఏ ఒక్కరూ ఎదురొడ్డి నిలవలేకపోయారు. క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 

భారత్ స్కోర్:

రోహిత్ శర్మ (34), గిల్ (28), కోహ్లీ (44), రహానే (49), అశ్విన్ (22) పరవాలేదనిపించారు. జడేజా 15 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో జెమీసన్ 5 వికెట్లు పడగొట్టగా, బౌల్ట్, వాగ్నర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. సౌథీ ఒక వికెట్ పడగొట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *