ఉద్యమ ధీశాలి… ఐలమ్మ

పేదలకు ఓ చుక్కానిలా… ఐలమ్మ

నవాబులకు వ్యతిరేకంగా పోరాడిన తొలి మహిళ

ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే నివాళులు

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన వీర వనిత… ఉద్యమ ధీశాలి చాకలి ఐలమ్మ అని మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు అన్నారు. ఐలమ్మ స్పూర్తితో మిర్యాలగూడ ప్రగతికి మరింత బాటలు వేద్దామన్నారు. శుక్రవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 36వ వర్దంతిని పురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్ పేటలో చాకలి ఐలమ్మ విగ్రహానికి నల్లమోతు భాస్కర్ రావు,   మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగాఎమ్మెల్యే మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, పోరాట విముక్తి కోసం పీడిత రైతాంగం కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తొలి మహిళా అని కొనియాడారు. నిజాం నిరంకుశ పాలన సాగుతోన్న రోజుల్లో రజాకార్లకు ఎదురొడ్డి నిలిచి రైతాంగ పోరాటంలో విజయం సాధించిన మహిళ అన్నారు. రజాకార్లకు, భూస్వాముల అరాచకలకు విసిగిపోయిన వారిలో రజాకార్లకు ఎదురునిలిచి దొరల గుండెల్లో గుబులు రేపి పేదలకు ఒక దిక్సూచిగా మారిందని ప్రపంచ మహిళా లోకానికి ఆదర్శంగా తెలంగాణ రైతాంగ పోరాటయోధురాలని, మలిదశ ఉద్యమానికి నిలువెత్తు నిదర్శనంగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బాసాని అలివేలు-గిరి, పట్టణ రజక సంఘం అధ్యక్షులు ఎర్రబెల్లి దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి కుమ్మరకుంట్ల సుధాకర్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *