మానవత్వం చాటుతున్న యువకులు

* షోయబుల్లా ఖాన్ ను ఆదర్శంగా తీసుకోవాలి
*యువకులను సన్మానించిన అవాజ్ కమిటీ

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : విపత్కర కరోనా పరిస్థితుల్లో మృత్యువాత పడుతున్న వారికి ఘన వీడ్కోలు పలుకుతూ ముస్లిం యువకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. గత కొన్ని నెలలుగా వీరు చేస్తున్న సేవను గుర్తించి ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ప్రముఖ జర్నలిస్ట్ షోయబుల్లాఖాన్ 73వ వర్ధంతి సందర్భంగా ఆవాజ్ కమిటీ రాష్ట్ర నాయకులు, సీనియర్ జర్నలిస్టు ఆయూబ్ ఆధ్వర్యంలో స్థానిక సిపిఎం కార్యాలయంలో షోయబుల్లాఖాన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. షోయబుల్లాఖాన్ చేసిన సేవలను, త్యాగాలను, పోరాటాలను స్మరించుకున్నారు. అనంతరం కరోనా మృతదేహాలకు వారి మత సాంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న మొహమ్మద్ అబ్దుల్ గయాజ్, రహమాన్ ఖాన్ బృందం సభ్యులకు శాలువాలతో ఘనంగా సత్కరించారు. వారు చేస్తున్న సేవలను కొనియాడారు. కులమతాలకు అతీతంగా యువకులు చేస్తున్న సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పలువురు వక్తలు కొనియాడారు. అవాజ్, సీనియర్ నాయకులు చాంద్ పాషా, అఫాన్ అలీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర నాయకులు, మసూద్, సిపిఎం జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నూకల జగదీష్ చంద్ర, డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, సత్యనారాయణ రావు, నాయకులు ఎండి అంజద్, ముస్లిం యువకులు బృందం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *