ఇంటింటికీ ఉచిత శానిటైజేషన్

ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలి 
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :నీతి అయోగ్, సీఎస్ఐఆర్, సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ పథకం ద్వారా నిర్వహిస్తున్న ఇంటింటికి ఉచిత శానిటైజేషన్ కార్యక్రమాన్ని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు. ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని కోరారు. కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. అంతేకాకుండా, ప్రతీ ఒక్కరూ తమ ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వీరకోటి రెడ్డి, జడ్పీటీసీ అంగోతు హాతీరాం నాయక్, సర్పంచ్లు బార్రెడ్డి అశోక్ రెడ్డి, సచిన్, ప్రోగ్రాం ఉమ్మడి నల్లగొండ జిల్లా కో-ఆర్డినేటర్ నేమాద్రి రవి, మిర్యాలగూడ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ రేవూరి నాగేశ్వర్ రావు, వెంకటేశ్వర్లు, తదితతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *