హేమంత్ కు ఆసరాగా.. హోప్ ఫర్ స్పందన

అక్షిత వార్త”తో హేమంత్ కు ఆదరణ
స్వయం ఉపాధికి హోఫ్ ఫర్ స్పందన చేయూత
వేములపల్లి, అక్షిత ప్రతినిధి :
పదేళ్లుగా మంచానికే “ వార్తకు హోఫ్ ఫర్ స్పందన సంస్థ స్పందించింది. హేమంత్ కు తోడ్పాటు నిచ్చేoదుకు కదిలింది. హేమంత్ కు స్వయం ఉపాధికి తగిన ఆర్థిక చేయూత నందించి అక్కున చేర్చుకుoది. వివరాల్లోకి వెళ్తే…నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలోని వేములపల్లి గ్రామానికి చెందిన అమరారపు హేమంత్ ప్లోరోసిస్ రక్కసికి చిక్కి విల విలలాడుతూ ఆపన్న హస్తo కోసం చూపుగా ఉన్న పరిస్థితిని అక్షిత తెలుగు జాతీయ దిన పత్రిక మానవీయ కథనాన్ని ప్రచురించింది. అందుకు అమెరికాలోని న్యూ జెర్సీకి చెందిన హోఫ్ ఫర్ స్పందన ఆర్థిక చేయూత నిచ్చి ఆదుకుంది. హేమంత్ స్వంతంగా
ఎదిగేందుకు తోడ్పాటునిచ్చింది. అందులో భాగంగానే వేములపల్లి మండలకేంద్రంలో ఆదివారం మీ సేవ, జిరాక్స్ సెంటర్ ను తెలంగాణ ప్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఆపన్న హస్తం అందించేందుకు హోఫ్ ఫర్ స్పందన ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయడం అభినందనీయమన్నారు. హేమంత్ కు ఉన్న జ్ఞానంతో మరింత ముందుకు సాగాలన్నారు. ప్లోరోసిస్ రక్కసి ఎంతో మంది బిడ్డలను ఇక్కట్లకు గురిచేసిందన్నారు. ప్రభుత్వాలు ఆదరించకున్నా… ఎన్నో స్వచంద సంస్థలు అండగా నిలుస్తున్నాయన్నారు. డిడిఎల్ విన్నర్స్ పౌండేషన్ అధ్యక్షులు అరికపూడి రఘు మాట్లాడుతూ హేమంత్ కు ఆసరాగా స్వయం ఉపాధి పొందేందుకు దోహద పడుతుందన్నారు. హాఫ్ ఫర్ స్పందన అమెరికా వారి ఆర్థిక సహకారంతో నెట్ సౌకర్యం అందే విధంగా జిరాక్స్ మిషన్, స్టేషనరీ కూడా అందించడం జరిగిందన్నారు. తనయుడి కి చేయూత నిచ్చి ఆదుకున్న హోప్ ఫర్ స్పందన కు
ప్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకుంట్ల సుభాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *