మన చరిత్ర… సంస్కృతికి ప్రతిభింబాలు

*మన చరిత్ర సంస్కృతికి ఆనవాళ్లు ఆలయాలు*

– శ్రీ *వేణుగోపాలస్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి జగదీష్ రెడ్డి*

సూర్యాపేట, అక్షిత బ్యూరో :మన చరిత్ర, సంస్కృతికి ఆనవాళ్లు దేవాలయాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో సిజిఎఫ్ నిధులు రూ 40లక్షలతో దేవస్థాన రాజగోపురం, రాతి కల్యాణ మండపం, ఆర్చిగేటు, ఎంసి నిధులు రూ 10లక్షలతో కాలక్షేప మంటప నిర్మాణ పనులను సోమవారం ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట పట్టణం ఏర్పడ్డ ప్రారంభంలోనే ఏర్పడి ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన విశిష్ట ఆలయం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం అన్నారు. ఆలయాలు మన చరిత్ర, సంస్కృతికి ఆనవాళ్లని ప్రజలలో పాపభీతి పెంపొందించడంలో, సమాజాన్ని సక్రమమైన పద్ధతిలో నడిపించడంలో, ప్రజలందరికీ మానవ విలువలను నేర్పించడంలో, సమాజాన్ని శాంతియుత సమాజంగా అభివృద్ధి చేయడంలో ఆలయాల పాత్ర ఎంతో ఉందన్నారు. భారతీయ సంస్కృతి వేల సంవత్సరాలు నిలబడి ఉందంటే దానికి కారణం ఆలయాలే అన్నారు. ఎన్నో విదేశీ దాడులు జరిగినా పరిపాలన చేసినప్పటికీ రాజ్యాలను జయించగలిగారు కానీ మన సంస్కృతిపై ఎవరు విజయం సాధించలేకపోయారని అన్నారు. భారతీయ సంస్కృతి వేల సంవత్సరాలు నిలబడి ఉన్నది అంటే అందుకు ఆలయాలు ఆలయాల ద్వారా జరిగిన సేవలే కారణమన్నారు. మధ్యలో ఆలయాలకు కొంత ఆదరణ లోపించిన, ఆలయాలపై కూడా దండయాత్రలు చేసినా, ఆలయాలు లేకుండా చేయాలనే ప్రయత్నం చేసినా, ప్రజల మనసుల్లో నుంచి ఆ భావాలను ఎవ్వరూ తీసి వేయలేకపోయారన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం పునర్ వైభవం సాధించి పట్టణ ప్రజలకు దైవ భావాన్ని, మానవీయ విలువలను పెంచేలా సేవలు అందించాల్సిందిగా కోరారు. అనంతరం స్వామివారికి గజవాహన సేవ నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ, కౌన్సిలర్ గండూరి రాధిక రమేష్ , ఆలయ అర్చకులు మురళీధర్ ఆచార్యులు వేణుగోపాల చర్యలు , వలివేటి వీరభద్ర శర్మ , శ్రీధరాచార్యులు, నాయకులు నెమ్మాది భిక్షం, మొరి శెట్టి శ్రీనివాస్ ఉప్పల ఆనంద్, కీసర వేణుగోపాల్రెడ్డి, పోలెబోయిన నర్సయ్య, ముదిరెడ్డి అనిల్ , మండాది నగేశ్ , దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.మహేందర్ కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్ కె.రాజయ్య, ఏవోలు లక్ష్మణరావు, రంగారావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *