మొక్కల సంరక్షణ పట్ల నిర్లక్ష్యం వహించొద్దు

జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

కొండమల్లేపల్లి, అక్షిత ప్రతినిధి :
పల్లె ప్రగతి,హరిత హారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ పట్ల నిర్లక్ష్యం వహించ వద్దని,మొక్కల పట్ల నిర్లక్ష్యం వహించిన వారి పై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.మంగళ వారం జిల్లా కలెక్టర్ కొండ మల్లే పల్లి లో పాల మూరు, రంగా రెడ్డి ఎత్తి పోతల పథకం కెనాల్ నెట్వర్క్ పై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం లో పాల్గొని నల్గొండ కు తిరిగి వస్తూ మార్గ మధ్యం లో రహదారి వెంబడి అవెన్యూ ప్లాంటేషన్,బ్లాక్ ప్లాంటేషన్, బృహత్ పల్లె ప్రకృతి వనం లను తనిఖీ చేశారు.కొండ మల్లే పల్లి జనప్రియ గార్డెన్స్ వద్ద రిపేర్ చేసిన కల్వర్టు వద్ద రహదారి వెంబడి మొక్కలు నాటాలని కలెక్టర్ అధికారులను ఆదేషించారు. చిన్న అడిశర్లపల్లి జి. పి.లో బృహత్ పల్లె ప్రకృతి వనం తనిఖీ చేసి ఫెన్సింగ్ చుట్టూ దిమ్మెలకు కలరింగ్,నేమ్ బోర్డ్ ఏర్పాటు చేయాలని అన్నారు.కొండ మల్లే పల్లి మండల, జి.పి.పరిధి లో రహదారి వెంబడి మొక్కలకు సపోర్ట్ గా కర్ర,చిన్న మొక్కల కు రక్షణగా ట్రీ గార్డ్,చిల్వ కంప ఏర్పాటు,పాదులు తీయాలని సూచించారు.పెద్ద చెట్ల కు వైట్ కలరింగ్ పెయింట్ వేయాలని సూచించారు.
గుర్రం పోడ్ మండలం మక్కపల్లి జి.పి.లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం తనిఖీ చేసి నీరు పోయక మొక్కలు ఎండి పోవడం పట్ల కలెక్టర్ ఆసంతృప్తి వ్యక్తం చేస్తూ సర్పంచ్ కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని జిల్లా పంచాయతి అధికారిని ఆదేశించారు. ఫెన్సింగ్ చుట్టూ దిమ్మెలకు కలరింగ్,నేమ్ బోర్డ్ ఏర్పాటు చేయాల న్నారు.తానేదార్ పల్లి జి.పి.లో బ్లాక్ ప్లాంటేషన్,కోతుల ఆహారశాల తనిఖీ చేశారు.రహదారి వెంబడి చిన్నగా ఉన్న మొక్కలకు రక్షణ గా ట్రీ గార్డ్,చిల్వ కంప ఏర్పాటు చేయాలని అన్నారు.కొప్పోలు జి.పి.లో రహదారి వెంట రెండు వరసలలో నాటిన మొక్కలు,నల్గొండ మండలం జి.చెన్నారం జి.పి. పరిధి లో,కొత్త పల్లి జి.పి.పరిధి లో మొక్కలు తనిఖీ చేసి మొక్కలు పొడవుగా పెరగటానికి ఎరువు పట్టించాలని, పాదులు తీయాలని,వాచర్స్ పర్యవేక్షణలో సంరక్షణ కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పంచాయతి అధికారి విష్ణు వర్ధన్,మండల,గ్రామ అధికారులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *