హరిత హారంతోనే… పచ్చదనం

జెడ్పి చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య
మహబూబ్ నగర్, అక్షిత బ్యూరో : పల్లెలన్నీ పచ్చదనంతో ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమం ప్రవేశపెట్టి అందులో భాగంగా ఏడవ హరితహారం కార్యక్రమం బుధవారం నాగర్ కర్నూలు జిల్లాలోని చారకొండ మండలంలోని చారకొండ, సిర్శనగండ్ల లో జెడ్పి చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి పర్యటించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయితీ అభివృద్ధి దిశగా నిధులు మంజూరు చేసి గ్రామంలో నర్సరీలు ప్రకృతి వనం డంపింగ్ యార్డ్ షెడ్డు స్మశాన వాటిక ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రైతులకు అందుబాటులో రైతు వేదికలు ఏర్పాటు చేయడము కట్టించి పూర్తి చేసిన ఘనత మన ముఖ్యమంత్రి అని కొనియాడారు . రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి పనులు అమలు చేస్తారని వారన్నారు. గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులలో నిర్లక్ష్య ఎవరు కూడా చేయరాదని, అధికారులు ప్రజా ప్రతినిధులు అందరూ కలిసిమెలిసి ఉండి అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. జడ్పీ వైస్ చైర్ పర్సన్ బాలాజీ సింగ్, ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపిడిఓ అదికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *