రేపు హాలియాకు సీఎం

రేపు హాలియాకు సీఎం కేసీఆర్

నాగార్జున సాగర్, అక్షిత ప్రతినిధి :

ఈనెల 2న ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి రోడ్డు మార్గంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు కేసీఆర్ చేరుకుంటారు. అక్క‌డి నుంచి హెలికాప్ట‌ర్‌లో ఉద‌యం గం.10- 40 నిమిషాల‌కు హాలియా చేరుకుంటారు. ఉ. 10-55కు స్థానికంగా ఉన్న మార్కెట్‌యార్డులో నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిపై ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో సీఎం కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హిస్తారు. మ‌ధ్యాహ్నం గంటల 1-10 నిమిషాల‌కు ఎమ్మెల్యే నోముల భ‌గ‌త్ నివాసంలో కేసీఆర్ లంచ్ చేస్తారు. అనంత‌రం గం.2-10 నిమిషాల‌కు హెలికాప్ట‌ర్‌లో హైద‌రాబాద్‌కు తిరుగు ప్ర‌యాణం అవుతారు. సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *