గుబాలించేలా గులాబీ పండుగ

*సెప్టెంబర్ 2న జెండా పండుగను విజయవంతం చేయాలి*

*సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గ్రామ, వార్డు కమిటీలు పూర్తి*

*సెప్టెంబర్ 12 నుంచి 20 వరకు మండల కమిటీలు పూర్తి*

*నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి*

*క్రియాశీలకంగా పనిచేసేవారికి కమిటీలలో ప్రాధాన్యత*

*ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్*

*టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు*

కోదాడ, అక్షిత ప్రతినిధి : కోదాడ నియోజకవర్గం వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ఏఆర్ ఏఆర్ ఫంక్షన్ హాల్ లో టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, *టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ తక్కెళ్లపల్లి రవీందర్ రావు* హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గులాబి శ్రేణులు భాగస్వాములు కావాలని తెలిపారు. సెప్టెంబర్ 2న నియోజకవర్గ వ్యాప్తంగా జెండా పండుగను నిర్వహించి గ్రామ వార్డు కమిటీలు మొదలుపెట్టాలని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గ్రామ వార్డు కమిటీలు వేయాలని అన్నారు. 12 నుంచి 20 వరకు మండల కమిటీ వేయాలని సూచించారు. అన్ని కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు 51% కమిటీలు ఉండే విధంగా చూడాలన్నారు. క్రియాశీలకంగా పనిచేసేవారికే కమిటీల్లో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. సెప్టెంబర్ రెండువేల ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో దేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు అందిస్తున్నామని తెలిపారు. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ ద్వారా లక్ష 116 అందిస్తున్నామని తెలిపారు. వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వమని అన్నారు. పారదర్శకంగా సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ఆర్ నారాయణ మూర్తి ఆట పాటలతో అలరించారు. రైతన్న సినిమా ను ఆదరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, అజయ్ కుమార్,ల మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి,అజయ్ కుమార్, లక్ష్మీ నారాయణ, ఎంపీపీలు,జెడ్పిటిసిలు,మండల పార్టీ అధ్యక్షులు,పీఏసీఎస్ చైర్మన్లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ,టిఆర్ఎస్ పార్టీ గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *