పచ్చదనమే …ప్రగతికి మెట్టు

ప్రభుత్వ విప్ ఆరికెపూడి గాంధీ

శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి : పచ్చదనం పరిశుభ్రత పరిరక్షణ ప్రగతికి మెట్టు అని శేరిలింగంపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని హైదర్ నగర్ డివిజన్ లోని కింది కుంట చెరువు వద్ద పార్క్ సుందరీకరణ పనులను కార్పొరేటర్లు శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ కలిసి ఎమ్మెల్యే గాంధీ పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పార్కులు చక్కటి వాతావరణం ఆహ్లదన్నీ మనసుకి ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలకు ఆటవిడుపుగా,పెద్దవారికి సేదతీరడానికి ఎంతగానో పార్కులు ఎంతోగాని ఉపయోగపడతాయని తెలిపారు,పార్కులో మౌలిక వసతులు కల్పనకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పార్క్ లో ఉదయం సాయంత్రం వాకింగ్ వచ్చే పిల్లలు పెద్దలు వృద్ధులకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశామన్నారు.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి మన పరిసరాలను మనమే కాపాడుకోవాలి అని సామాజిక దృక్పథం ప్రతిఒక్కరు అలవాటు చేసుకోవాలని అన్నారు.ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి పార్కులను సంరక్షించే బాధ్యత ప్రతి ఒకరిది అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *