పచ్చదనంతోనే… పల్లె ప్రగతి – సర్పంచ్ విజయ శ్రీనివాస్ రెడ్డి

అక్షిత న్యూస్, మాడుగులపల్లి: పచ్చదనం తోనే పల్లె ప్రగతి సాధ్యమని గారకుంటపాలెం సర్పంచ్ విజయ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని గారకుంటపాలెం గ్రామపంచాయతీ పరిధిలో 4వ విడత హరితహారం భాగంగా జీవన వైవిధ్యం కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా సర్పంచ్ జొన్నలగడ్డ విజయ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని పురస్కరించుకొని గ్రామంలో మొక్కలు నాటారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానన్నారు. కరోనా రాకుండా గ్రామస్తులకు సలహాలు సూచనలు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించి తిరగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిచ్చయ్య, కార్యదర్శి కోటిలింగం, చెరుకుపల్లి జానయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *