అధికారులు అప్రమత్తంగా ఉండాలి: గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య

వరంగల్, అక్షిత బ్యూరో: భారీ వర్షాల దృష్ట్యా బల్దియా అధికారులతో సమావేశమైన కమిషనర్.బల్దియాలో కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 1980, వాట్స్ అప్ నంబర్ 7997100300 ఏర్పాటు. బల్దియాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని గ్రేటర్ కమిషనర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రధాన కార్యాలయంలో బల్దియా ఇంజనీరింగ్, శానిటేషన్, డి ఆర్ ఎఫ్ విభాగాల అధికారులతో సమావేశమై భారీ వర్షాల నేపధ్యంలో తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కార్యస్థానంవ దిలి. వెళ్లకూడదని, ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ మరియు శానిటేషన్ విభాగాలు సమన్వయంతో పని చేయాలని అన్నారు. నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికపుడు సానిటేషన్‌లో, స్తబ్దత ప్రదేశాలను ప్రాధాన్యత క్రమంలో క్లియర్ చేయాలన్నారు. డిఆర్ఎఫ్ బృందం చురుకుగా ఉండాలని, జల దిగ్బంధంలో ఇరుక్కున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వర్షాల వల్ల కూలిన గోడలు, పురాతన గృహాలు, చెట్లను వెంటనే క్లియర్ చేయాలన్నారు. సర్కిల్ కు 3 శానిటేషన్ బృందాలను ఏర్పాటు చేసినట్లు, 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ బ్లాకేజీ లను క్లియర్ చేయాలని ఆదేశించారు.బల్దియా కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబరు మరియు కంట్రోల్ రూమ్‌లో స్వీకరించబడిన ఫిర్యాదులు ఎప్పటికపుడు పర్యవేక్షిస్తు ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కమిషనర్ నాగేశ్వర్, ఎస్ ఈ సత్యనారాయణ, సి పి వెంకన్న,సిఎంహెచ్ ఓ రాజా రెడ్డి, డి ఎఫ్ ఓ కిషోర్, డెప్యూటీ కమిషనర్లు జోనా, రవీందర్, ఈ ఈ లక్ష్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *