ప్రభుత్వ పథకాలను పేదలకు అందిస్తాం

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తాం

వి.పూజిత జగదీశ్వర్ గౌడ్,హఫీజ్పెట్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు..
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి : ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న  పలు ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తామని మాదాపూరు డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మంగళ వారం జిహెచ్ఎంసి జనరల్ బాడీ తొలి సమావేశంలో తన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో 2021-22 ఆర్థిక సంవ‌త్స‌ర ప‌ద్దును బ‌ల్దియా ఆమోదించింది. రూ. 5,600 కోట్ల ప‌ద్దుకు జీహెచ్ఎంసీ ఆమోదం తెలిపింది. నూత‌న పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలో,మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి అధ్య‌క్ష‌త‌న‌ తొలి స‌ర్వ‌స‌భ్య స‌మావేశం నిర్వహించారు,క‌రోనా మ‌హ‌మ్మారి దృష్ట్యా వ‌ర్చువ‌ల్‌గా జరిగిన స‌మావేశంలో నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై టీఆర్ఎస్ మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ ప్రసంగించారు. 2021-22 సంవత్సరానికి సంబంధించిన బ‌డ్జెట్‌ను గత డిసెంబర్‌ 17న స్టాండింగ్‌ కమిటీ ఆమోదించిన సంగ‌తి తెలిసిందే బడ్జెట్ పై మాట్లాడే అవకాశం కల్పించిన నగర మేయర్ కి మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ ధన్యవాదాలు తెలిపారు. మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో,మున్సిపల్ శాఖామంత్రివర్యులు కేటీఆర్ దిశానిర్దేశంలో గ్రేటర్ హైదరాబాద్ నగర అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో మౌలికవసతుల అభివృద్ధికి కృషి చేస్తుందని,రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా తాము కృషి చేస్తానని,ప్రజలతరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. డివిజన్ అభివృద్ధి పనులు త్వరగా ప్రారంభించి పూర్తయ్యేలా చూస్తామని, మిలిగి ఉన్న సీసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్మశానవాటికలో అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపుడి గాంధీ నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *