ప్రభుత్వ విద్యకు సర్కార్ పెద్దపీట

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ

బొల్లంను సత్కరించిన ఎంఈఓ సలీం షరీఫ్

కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తుందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలను కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విద్యను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నమని అన్నారు. విద్యారంగానికి వేల కోట్లు కేటాయించి విద్యను ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొస్తామన్నారు. కార్పొరేట్ స్థాయి విద్యను పేద విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది గురుకుల పాఠశాలను మంజూరు చేయించి విద్యార్థులకు ప్రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ…. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఆకాశమంత ఎత్తు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. సమాజ నిర్మాణం నాలుగు గోడల మధ్య నిర్మించబడుతుంది అని ఆయన తెలిపారు. పేపర్ బాయ్ గా పనిచేసిన ఏ.పీ.జే అబ్దుల్ కలాం ఈ దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతిగా ఎదిగారని అని వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ముందుకెళ్లాలని సూచించారు. వీధిలైట్లు చదువుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. మహనీయులను ఆదర్శంగా తీసుకొని ఎదగాలని అన్నారు. విద్య ఉన్న వారే ధనవంతులని అన్నారు. అనంతరం వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంక్షేమం రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎన్నికైన ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. పాఠశాలఆవరణలోఎమ్మెల్యేతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సలీం షరీఫ్, ఎంపీపీ కవితా రాధా రెడ్డి, జడ్పిటిసి కృష్ణకుమారి శేషు, కౌన్సిలర్ సూర్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు శివకుమారి, నాయకులు సత్తి బాబు, వెంపటి మధు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ యాదవ్, కోట మధుసూదన్, స్వామి నాయక్, మేదర లలిత, బత్తుల ఉపేందర్, మాదాల ఉపేందర్, అభి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *