గౌడన్నల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కృషి

కులాల ఆర్థిక అభివృద్ధే  కేసీఆర్ ధ్యేయం 

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

హుజూరాబాద్, అక్షిత ప్రతినిధి : హుజరాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో గౌడ కులస్తులతో చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ…గౌడన్నల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. గౌడన్నల కోసం నీరా పాలసీ తీసుకురావడం జరిగింది. గౌడన్నలకు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. త్వరలోనే గౌడన్నలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రమాదవశాత్తు చనిపోతే 5లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *