గొర్రెల మేకలకు నట్టల నివారణ మందులు

గ్రామ సర్పంచ్ జయరాములు

మహబూబ్ నగర్, అక్షిత బ్యూరో : గొర్రెల మేకలకు నట్టల నివారణ మందులు వేయించుకోవాలని గ్రామ సర్పంచ్ జయ రాములు, ఎంపీటీసీ సభ్యులు భాస్కర్ రెడ్డి, అన్నారు, సోమవారం వనపర్తి జిల్లాలోని పానగల్ మండలం మహ్మదాపూర్ గ్రామం లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు మేకలకు నట్టల నివారణ మందులు వారు ప్రారంభించారు , ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గొల్ల కుర్మలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నారు అని కొనియాడారు, ప్రభుత్వం ద్వారా ఉచితంగా వచ్చే మందులను తీసుకోవాలని, ఎలాంటి వ్యాధులు జబ్బులు రాకుండా నివారణ టీకాలు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు, ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ సభ్యులు భాస్కర్ రెడ్డి , జిల్లా గొర్రెల కాపరుల సంఘం యూనియన్ డైరెక్టర్ తిరుమల్ యాదవ్, మండల పశువైద్యాధికారి శ్యామ్, గొర్రెల సంఘం అధ్యక్షులు గంగాధర్ యాదవ్, బాల్ చంద్రయ్య రామచంద్రయ్య నాగయ్య నరసయ్య ఈశ్వర ముచ్చర్ల చంద్రయ్య శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *