గొల్ల కురుమలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

జిల్లా, గ్రామీణ స్థాయిలలో ఉండే వారిపై ప్రభుత్వం దృష్టి సారించాలి

భేరి రామచందర్ యాదవ్

శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :
రంగారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే గొల్లకుర్మలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో ఆదుకోవాలని రంగారెడ్డి జిల్లా యాదవ మహాసభ అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ విజ్ఞప్తి చేశారు, గురువారం ఆయన అక్షిత ప్రతినిధితో మాట్లాడుతూ గతంలో కొన్ని పార్టీలు యాదవుల హక్కులను కాలరాస్తున్నారని ప్రస్తుతం యాదవ హక్కులను ఆదుకోవడానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గొల్ల కురుమలను ఆదుకోవాలని కోరారు. గొర్రెలు, కోసం లబ్ధిదారులు బ్యాంకులలో డిపాజిట్లు చేశారని, డిపాజిట్ చేసిన వారందరికీ రెండో విడత గొర్రెల పంపిణి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి గొల్ల కురుమలను ఆదుకోవాల్సిన బాధ్యత చాలా ఉందన్నారు, గ్రామీణ ప్రాంతాలలో గొల్ల కురుమల కోసం తెలంగాణ రాష్ట్రం లో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిధులు మంజూరు చేసి గొల్ల కురుమలు అభివృద్ధికి కోసం కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా తాండూర్ పరిసర ప్రాంతాలలో గొర్రెలు మేకలు, కోసం వర్షాకాలంలో గొర్రెలు మేకలకు వ్యాధులకు గురి అవుతున్నాయి వ్యాధి బారినపడి గొర్రెలు మేకలు చాలా చనిపోతున్నాయి టీకా మందులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించి గొల్ల కురుమలను వర్షాకాలంలో వ్యాధులకు గురై చనిపోతున్న గొర్రెలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. గొల్ల కురుమల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్ జిల్లా యాదవ్ బంధుమిత్రులు తరఫున ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *