ఘట్కేసర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

ఘట్కేసర్ అభివృద్దే ధ్యేయం
రూ.77 లక్షలతో అభివృద్ది పనులు
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

ఘట్కేసర్, అక్షిత ప్రతినిధి :
ఘట్కేసర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలుపుతామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని అభివృద్ధి పనుల్లో భాగంగా మున్సిపల్ చైర్మన్ పావని ఆధ్వర్యంలో రూ.77.50 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకు స్థాపన చేశారు. 1వ వార్డులో రూ. 8 లక్షల నిధులతో డ్రైన్ వాటర్ పైపులైన్, 2వ వార్డులో ఉన్న కమ్యూనిటీ హాల్, పార్క్ స్థలం సంరక్షణ కోసం రూ. 10 లక్షల నిధులతో చుట్టూ ఫెన్సింగ్, 18వ వార్డులో రూ. 12 లక్షల నిధులతో సీసీ రోడ్డు, 16వ వార్డులో రూ.25 లక్షల నిధులతో సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులైన్, 11వ వార్డులో రూ. 17 లక్షల నిధులతో డ్రైనేజీ వాటర్ పైపులైన్, 14వ వార్డులో 6.50 లక్షల నిధులతో సీసీ రోడ్డులతో కలిపి మొత్తంగా రూ. 77 లక్షల 50 వేల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. చైర్మన్ పావని మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి సహకారంతో ఘట్కేసర్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాధవరెడ్డి, వార్డు కౌన్సిలర్, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తదనంతరం ఘట్కేసర్ మండలoలోని ఎదులాబాద్, మరిపల్లిగూడ, వెంకటాపూర్, మాదారం లో వైకుంఠ ధామానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, వార్డ్ మెంబర్స్, ఎంపిపి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *