గేదెల దొంగల ముఠా అరెస్ట్

గేదెల దొంగతనం కేసును ఛేదించిన కోదాడ పోలీసులు

కోదాడ, అక్షిత ప్రతినిధి : 14 లక్షల విలువ చేసే గేదెల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నేరస్తులందరూ గతములో సూర్యాపేట జిల్లా కోదాడలోని పశువుల సంతలో పశువులను వాహనాలలో ఎక్కించడం, దించడము, వాహనాల డ్రైవర్లుగా పనిచేయడoతో ఒకరికొకరు పరిచయం అయ్యి మహమ్మద్ మతాబ్ సాహెబ్ ఆధ్వర్యంలో మూడు గ్యాంగులుగా ఏర్పడి లాక్ డౌన్ సందర్బముగా వారు చేసే వృత్తుల వలన వచ్చే ఆదాయము వారి జల్సాలకు సరిపడక పోవడం వలన దొంగతనాలు చేయాలని నిర్ణయించుకొని కోదాడ, చిల్కూరు, మేళ్లచెర్వు మరియు హుజూర్ నగర్ మండలాల పరిధి లోని గ్రామాలలో వేసవి సమయములో మేత కొరకు విడిచి పెట్టిన గేదెలను టార్గెట్ చేసుకొని రాత్రి సమయాన ఒంటరిగా మేస్తుండగా వాటిని దొంగిలించి సైదులు యొక్క బొలేరో ఏపీ-24-టిసి-2822 మరియు, మొలుగూరి సుధీర్ యొక్క దోస్త్ టీఎస్29-టీ ఏ-0439 వాహనాల్లో సుమారు 60 మంది రైతుల 100 గేదెలను దొంగిలించి సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో గలఫ్రీగ్రిఓ కన్సర్వా అల్లాన ప్రయివేట్ కంపెనీ కి తరలించి అమ్ముకోనగా, మహమ్మద్ మతాబ్ సాహెబ్ కు గతంలో అట్టి కంపెనీ వారు వ్యాపారము చేయుటకు ఇచ్చిన బార్ కోడ్ ఆధారముగా రికార్డు చేసుకొని అతని బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నందు డబ్బులను జమ చేయగా అందరూ కలిసి ఆ డబ్బులను పంచుకునేవారు వాహనాల తనిఖీలో భాగంగా నేరస్తులు రెండు వాహనాలలో మళ్ళీ దొంగతనము చేసుకొని వస్తుండగా కోదాడ రూరల్ సీఐ శివరాంరెడ్డి, కోదాడ రూరల్ ఎస్సై వై. సైదులు, సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ఈ నేరస్తులందరిని విచారించగా మహమ్మద్ మతాబ్ సాహెబ్ ఆధ్వర్యం లో మూడు గ్యాంగులుగా ఏర్పడి కోదాడ, చిల్కూరు, మేళ్లచెర్వు మరియు హుజూర్ నగర్ మండలాల పరిధిలో 9 నేరాలలో 100 గేదెలను దొంగిలిచారని విచారణలో ఒప్పుకున్నారు. చాకచక్యత చూపించి కేసును ఛేదించిన కోదాడ రూరల్ సీఐ కే శివరాంరెడ్డి, కోదాడ రూరల్ ఎస్సై సైదులు, సిబ్బంది ఏ.నిరంజన్, షేక్ ఖయ్యుమ్, కే.సురేష్, షేక్ ఘని లను ఎస్పీ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *