ఆహార భద్రతకే… రేషన్ కార్డులు

నెలాఖరు వరకు రేషన్‌ కార్డుల పంపిణీని పూర్తి 

మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట, అక్షిత బ్యూరో : కొత్తగా మంజూరైన రేషన్‌ కార్డుల పంపిణీని ఈనెల చివరికి పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా తక్షణం చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. కొత్తగా ఆహార భద్రత కార్డులు పొందిన వారికి ఆగస్టు నుంచి రేషన్ ను అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. కొత్తగా మంజూరు ఆయిన ఆహారభద్రత కార్డులను ఆయన బుధవారం రోజున సూర్యాపేట నియోజకవర్గంలో మండలాల వారిగా పంపిణీ చేశారు. ఆత్మకూరు ఎస్‌ 425, చివ్వేంల 436, సూర్యాపేట పట్టణానికి సంబంధించిన 608 కార్డులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆకలి తీర్చిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో ఉండే అభాగ్యులను గుర్తించి వారి బాధలను తెలుసుకుని పరిష్కరించే సామర్ధ్యం ఉన్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు.రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకత మనందరికంటే బహుబాగా తెలిసిన నేత సీఎం కేసీఆర్ మాత్రమే నని ఆయన స్పష్టం చేశారు. సమైక్యాంధ్రలో మంత్రిగా ఉన్న రోజుల్లో ఇక్కడి ప్రజలను ప్రజలుగా..రైతులను రైతులుగా..సంస్కృతిని సంస్కృతిగా చివరి ఆఖరికి ఇక్కడి గ్రామ దేవతలను దేవతలుగా గుర్తించేందుకు వారికి మనస్కరించ లేదన్నారు. అటువంటి దుర్భర పరిస్థితులలో పదవులను తృణప్రాయంగా త్వజించి చావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రాన్ని సాధించిందే ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం కోసం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *