వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ 

బాధితులకు లయన్స్ క్లబ్ చేయూత

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 

నిర్మల్, అక్షిత ప్రతినిధి : నిర్మల్ పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన వరద బాధితులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు,దుప్పట్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం పంపిణి చేశారు. వరద బాధితులందరిని ఆదుకునేందుకు సంబంధిత శాఖల ఆధ్వర్యంలో నష్ట పరిహార అంచనాను వేయించినట్టు తెలిపారు. ప్రతీ ఒక్కరికీ త్వరలోనే నష్ట పరిహారం అందిస్తామన్నారు. ఆపదలో ఉన్న వారికి లయన్స్ క్లబ్ అండగా ఉండటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయ రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, వైస్ చైర్మన్ షేక్ సాజిద్, లయన్స్ క్లబ్ సభ్యులు బశ్వేశ్వర రావు, గంగారెడ్డి, సుధీర్ బాబు, ఎఫ్ఎస్ సీఎస్ చైర్మన్ ధర్మజి రాజేందర్, ఆర్డీవో రమేష్ రాథోడ్, ఆన్వర్, సలీం, కత్తి సుధాకర్, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *