ఫిట్ నెస్ కు జిమ్ ఉపయుక్తం

గ్రామీణ ప్రాంతాల్లోనూ

యువత సేవలందించాలి       

మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, అక్షిత బ్యూరో :గ్రామీణ ప్రాంతాల్లోనూ యువత సేవలందించాలని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో బాలుర, బాలికల జిమ్, రిక్రియేషన్ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వైద్య విద్యార్థులు సేవా భావంతో పని చేయాలని పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ వైద్య కళాశాలలో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. గొప్ప సంకల్పంతో వైద్య కళాశాలను ప్రారంభించామని, విద్యార్థులు బాగా చదివి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *