ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్

“అజాదికా అమృత్ మహోత్సవ్”
ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2 .0

సూర్యాపేట, అక్షిత ప్రతినిధి : నెహ్రూ యువ కేంద్ర ఉమ్మడి నల్లగొండ జిల్లా అద్వర్యంలో సూర్యాపేట జిల్లాలో ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ పాల్గొని ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ జెండా ఊపి ఫ్రీడమ్ రన్ ప్రారంభించారు. స్థానిక మిని ట్యాంక్ బండ్ (సద్దుల చెరువు) నుండి గాంధి పార్క్ వరకు ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 744 జిల్లాలో ప్రతి జిల్లాలో 75 గ్రామాల్లో ఆగస్టు 13 నుండి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అజాదికా అమృత్ మహోత్సవ్ ద్వారా 75 వ స్వతంత్ర దినోత్సవం ఒక ప్రజా ఉద్యమం కావాలని తెలియజేశారు. నెహ్రూ యువ కేంద్ర సంఘాటన్ క్రీడా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆగస్టు 13 నుండి అక్టోబర్ 2న గాంధీ జయంతి వరకు ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ను నిర్వహిస్తూనట్లు తెలిపారు. ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ లో ప్రతి రోజు అరగంట శారీరక వ్యాయాయం చేయాలనీ తెలిపారు. దేశం బలంగా తయారు అవ్వాలంటే యువకులు బలంగా ఉండాలి. యువత ముందుండి మిగతా వారిని కూడా ప్రోత్సహించాలని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో భూక్యా ప్రవీణ్ సింగ్ నెహ్రు యువ కేంద్ర ఉమ్మడి జిల్లా అధికారి, బి. వెంకట్ రెడ్డి డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్, సూరి బాబు ఎన్ సీసీఅధికారి, ఇరిగి కోటేశ్వరి జిల్లా రెడ్ క్రాస్ ఛైర్పర్సన్, హనుమంత రావు లయన్స్ క్లబ్, అండాలు స్ఫూర్తి క్లబ్, ఉమేష్ సేవ భారతి, యువకులు, యువజన సంఘాలు. ఎన్ ఎస్ ఎస్,ఎన్ సీసీ, స్వచ్ఛంద సంస్థలు, నేషనల్ యూత్ వాలంటీర్స్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *