ఫాం హౌస్ పాలనకు చరమ గీతం

నియంత పాలనను అంతానికి ఉద్యమించాలి 

మూడవదశ ఉద్యమానికి రౌండ్ టేబుల్ సమావేశంలో నినదించిన నేతలు

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : ఏ లక్ష్యంతో పోరాటాలు చేసి ప్రత్యెక తెలంగాణా రాష్ట్రాన్ని సాదించు కున్నామో  దానికి బిన్నంగా రాష్ట్రములో నిరంకుశ పాలనా కొనసాగుతుందని పలువురు నేతలు  ఆందోళన వ్యక్తం చేసారు.టిఆర్ఎస్ పార్టి , కేసిఆర్  నిరంకుశ పాలనను అంతమొందిచాలంటే మూడవదశ ఉద్యమం అనివార్యమని ముక్త కంటం తో నినదించారు. శుక్రవారం లకిడికాపూల్ లో తెలంగాణా ఉద్యమ ఆకాంక్షల వేదిక ఆద్వర్యం లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సమావేశం లో ప్రతేక తెలంగాణాకోసం పోరాటం చేసిన నేతలు,మేదావులు,  ప్రజాసంఘాల నాయకుల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాశం యాదగిరి,గాదె ఇన్నయ్య, చెరుకు సుధాకర్, దిలీప్ కుమార్,మల్లు రవి,డికే.అరుణ, మధు యాస్ఖి,పిఓడబ్లు సంధ్య,దాసోజు స్రవన్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ దేశ్ పాండే, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, లతో పాటు ఉస్మానియా యూనివర్ సిటీ విద్యార్థి జేఏసి,కాకతీయ యూనివర్ సిటీ విద్యార్థి జేఏసి నాయకులతో పాటు పలు సంఘలనేతలు పాల్గొని ప్రసంగించారు.గతం లో నక్సల్స్ సమస్య ఉన్న సమయం లోకూడా ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉండేదని,కాని ప్రత్యెక రాష్ట్రాన్ని సాదిన్చుకున్న తర్వాత తెలంగాణా  ప్రజలు ప్రశ్నించే హక్కును కోల్పోయారని నేతలు పేర్కొన్నారు.నేడు తెలంగాణా రాష్ట్రము లో పొలిసు రాజ్యమేలుతుందని ,ప్రభుత్వం చేసే అన్యాయాలను అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తు నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారని,రాష్ట్రము లో అప్రకటిత ఏమర్జెంన్సి కొనసాగుతుందని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది .తెలంగాణా రాష్ట్రము రాజకీయ కోణం లో కాకుండా రాష్ట్ర ప్రజల కోరికలకు అనుగుంగా అభివృద్ధిపై ఏర్పడిందన్నారు. కాని నేడు రాజకీయ కోణం లో ప్రజా ఆశయాలకు భిన్నంగా పరిపాలన కొనసాగుతుందన్నారు. వీటిని ఎదురు కొనాలంటే పార్టీలకు అతీతంగా, అందరు కలిసి కట్టుగా సంఘటితమై మూడవ దశ పోరాటానికి సన్నద్ధం కావాలని సమావేశం ముక్త కంటం తో పిలుపు నిచ్చింది.కులాల మద్య చిచ్చు పెట్టి కలిసి ఉండకుండా కల్వకుంట్ల కుటుంబం కుట్రలు చేస్తుందని విమర్శించారు. ఏపి సిఎం జగన్, తెలంగాణా సిఎం కెసిఆర్ ల  కుట్రలోని బాగామే నేడు ఇరు రాస్త్రాలమద్య జలవివాదమన్నారు. నేడు తెలంగాణా ప్రజలు స్వేచ్చ, ప్రజాస్వామిక పరిపాలనను కోరుకుంటున్నారన్నారు. తెలంగాణా ప్రజలకు ఉద్యమాలు కొత్త కాదని తొలిదశ, మలిదశ ఉద్యమాలు చూసారని మూడవదశ ఉద్యమానికి సహితం సిద్దంగా ఉన్నారన్నారు.నేడు తెలంగాణా ప్రజలు స్వయం పాలన, స్వేఛ్చ, ఆత్మా గౌరవం తో కూడిన తెలంగాణాను కోరుకుంటున్నారన్నారు.ప్రజల ఆకాంక్షలను సాదించడం కోసం ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ వేదికలో బాగాస్వములై ఫాం హౌస్ పాలనకు చరమ గీతం పాడాలని, నియంత పాలనను అంతమొందించాలని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, తెలంగాణా నమ్మక ద్రోహి కెసిఆర్ ను ముఖ్య మంత్రి పదవి నుండి గద్దె దింపాలని సమావేశం  ఏకగ్రేవంగా నినదించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *