చిన్నారి ఫైజాకు శుభాకాంక్షల వెల్లువ

చిన్నారి ఫైజాను ఆశీర్వదించిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ సిద్దార్ధ 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : నల్లగొండ జిల్లాకు చెందిన ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ తన కుమార్తె ఫైజా పుట్టినరోజు సందర్భంగా స్థానిక క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావును, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిన్నారి ఫైజాకు మిఠాయి తినిపించి భాస్కర్ రావు ఆశీర్వదించారు. కాసేపు ఫైజాతో సరదాగా ముచ్చటించారు. చిన్నతనం నుంచే బాగా కష్టపడి చదువుకొని ఉజ్వల భవిష్యత్తు పొందాలని కోరారు.

ఈ సందర్భంగా హమీద్ షేక్ మాట్లాడారు. తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వదించిన ప్రియతమ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఫైజాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రివర్యులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, హైదరాబాద్ నగర పోలీస్ అదనపు కమిషనర్ షికా గోయల్, డీఐజీ బి.సుమతి, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, కమిషనర్ చీమ వెంకన్న, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, విశ్రాంత డీఎస్పీ రాజేశ్వర్ రావు, ఇన్స్ పెక్టర్స్ సదా నాగరాజు, నిగిడాల సురేష్,గంగాధర్, అక్షిత దిన పత్రిక చీఫ్ ఎడిటర్ మాతంగి దాస్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు హమీద్ షేక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి షోయబ్, కోటేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *