పాన్ గల్ మండలం శాగాపూర్ గ్రామంలో మాజీ మంత్రి జూపల్లి మార్నింగ్ వాక్

మహబూబ్నగర్, అక్షిత బ్యూరో: పాన్ గల్ మండల పరిధిలోని శాగాపూర్ గ్రామంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ఉదయం మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాజా మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ కార్యకర్తలతో కలిసి మార్నింగ్ వాక్ లో భాగంగా గ్రామంలో పర్యటించి వివిధ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.గ్రామంలోని పురవీధుల గుండా పర్యటిస్తున్న సందర్భంలో గ్రామపంచాయతీ ముందు సర్పంచ్ తో వారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్న వస్తున్న నిధులపై ఆరా తీశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను ఉపయోగించుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రామ అభివృద్ధి నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా జూపల్లి గారు పిలుపునిచ్చారు.అదేవిధంగా తమ గ్రామానికి చాన్నాళ్ల నుంచి బస్సు రావడం లేదని గతంలో క్రమం తప్పకుండా వచ్చేదని పట్టణ ప్రాంతాలకు వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నామని ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుందని తమ ఆవేదనను జూపల్లి గారి ముందు వ్యక్తం చేశారు అక్కడి నుండే సంబంధిత డి ఎం గారి దృష్టికి జూపల్లి గారు ఫోన్ చేసి సమస్యను వివరించారు వెంటనే వారికి అనుగుణంగా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.రైతులు మార్కెట్ కు కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు తక్కువగా వచ్చాయని ఆరా తీస్తే ధాన్యం సంచులు తక్కువ రావడంతో దానికి సరిపడా అమౌంట్ జమ చేశామని అధికారులు బదులిస్తున్నారని బాధితులు వాపోయారు తాము అమ్మిన ధాన్యానికి సరిగా అమౌంట్ వచ్చేలా అధికారులతో మాట్లాడాలని జూపల్లి గారిని కోరారు.. అదే విధంగా ఎస్సి కాలనీలో తమ ఇంటిపై నుంచి 11KV కరెంట్ లైన్ పోవడంతో వర్షాల కారణంగా తమ ఇల్లు ఎర్తింగ్ అవుతున్నదని దానివల్ల భయంతో గడపాల్సిన స్థితి నెలకొన్నదని బాధితుడు జూపల్లి గారిముందు విన్నవించుకున్నారు వెంటనే సంబంధిత AE గారితో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. అనంతరం గ్రామ పార్టీ సీనియర్ కుటుంబం కదిరే బిచ్చమ్మ తమ ఇంట్లో టిఫిన్ చేయాలని కోరడంతో జొన్న రొట్టె తిని వారిని సంతోష పరిచారు..ఈ కార్యక్రమంలో వారితోపాటు మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాజా మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *