ఉద్యోగాలకై బిజేవైఎం గర్జన

*యువ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడి*
*ములుగు, అక్షిత బ్యూరో :
జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుండి చౌరస్తా మీదుగా కలెక్టర్ ఆఫీస్ వరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ములుగు జిల్లా బిజెపి అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నీళ్లు,నిధులు నియామకాల కోసం కోట్లాది తెచ్చుకున్న తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో నిరుద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు.నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ వ్యవహార శైలి మారకుంటే రాబోయే రోజుల్లో నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారు అని అన్నారు.రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని అన్నారు.ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన నిరుద్యోగ భృతి 3016 ఇవ్వాలని,గడిచిన కాలంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని,దీనికి బాధ్యత ప్రభుత్వాన్ని హెచ్చరించారు.తెలంగాణ వస్తే ఆత్మహత్యలు ఉండవని చెప్పిన కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా,నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నారని అన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం తీరుతోనే ఇప్పటికీ తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.రాష్ట్రంలో నిరుద్యోగులు అందరికీ న్యాయం జరిగే ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే వరకు బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వదిలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెండులక్షల ఖాళీగా ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేకపోతే రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలు మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన అధికార ప్రతినిధి తాటి కృష్ణ,జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్,గాజుల కృష్ణ,బిజెపి జిల్లా అధికార ప్రతినిధి వాసుదేవరెడ్డి,బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు బిక్షపతి,జిల్లా కార్యాలయ కార్యదర్శి చండూరు మహేందర్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొంతి రెడ్డి రాకేష్ రెడ్డి,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సానికొమ్ము హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *