ఎక్కిరింత ” పుస్తకo ఆవిష్కరణ

సాహిత్యంతో… సామాజిక విప్లవం

 డిఎస్పి రవికుమార్

తుంగతుర్తి, అక్షిత ప్రతినిధి : సాహితీ వేదిక తుంగతుర్తి వారి ఆధ్వర్యంలో వరకుమార్ గుండెపంగు రాసిన *ఎక్కిరింత* పుస్తకాన్ని తుంగతుర్తి మండల కేంద్రంలో డిఎస్పి గోల్లూరి రవికుమార్ తన కార్యాలయంలో శనివారం విష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సాహితీ వేదిక కన్వీనర్ గుండగాని శ్రీనివాస్ మాట్లాడుతూ… సాహిత్యమనేది సమాజములో పెనుమార్పులు తీసుకువస్తుందని ,జనబాహుల్యంలోకి ఇటువంటి కథలు మరెన్నో రావాలన్నారు. ఇట్టి పుస్తకాన్ని కొల్లూరి పెంటయ్య కు అంకితం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ పుస్తకం రాయడానికి సహకరించిన డి.ఎస్.పి రవి కుమార్ కు తుంగతుర్తి సాహితీ వేదిక తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాహితీ వేదిక సభ్యులు ఎర్ర హరికిషన్, మల్లెపాక రవీందర్, నాగుల గణేష్, విప్లవ్ కుమార్, మహిపాల్ రెడ్డి,తొట్ల సుధాకర్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *