విద్యారంగంలో విశ్వ ఖ్యాతి

విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు

విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు

మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట, అక్షిత బ్యూరో : విద్యా రంగంలో విశ్వ ఖ్యాతి… స్వామి నారాయణ గురుకుల్. విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసింది. పలు సంస్కరణలతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా పలు పాఠశాలలను నెలకొల్పిన స్వామి నారాయణ గురుకుల్ సూర్యాపేటలో మరో బ్రాంచిని తెరిచింది. జిల్లా కేంద్రంలో శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ పాఠశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పరిధిలోని ఉండ్రుగొండ శివారులో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ పాఠశాల నిర్మాణ భూమి పూజ చేశారు.అనంతరం అపూర్వ ఇన్ఫ్రా వారి శ్రీ స్వామి నారాయణ్ ఎకో టౌన్ షిప్ ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన 120 ఎకరాల వెంచర్ బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గురుకుల్ నారాయణ్ ట్రస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా వందలాది పాటశాలల నిర్వాహణతో విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ సమాజ నిర్మాణంలో అద్భుతమైన పాత్రను పోషిస్తుందన్నారు. శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ వారికి ఎకో టౌన్ షిప్ వారు సహకరించడం సంతోషకరమన్నారు.శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ పాఠశాలను ను సూర్యాపేటలో ఏర్పాటుకు ముందుకు రావడం గొప్ప విషయమన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు శ్రీ దేవ్ ప్రసాద్ దాస్ జీ స్వామీ జీ,జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్,జ్యోతిష్య మాస్టర్ వెంకట వేణు మాధవ్, నిత్య స్వరూప్స్వామి ప్రేమ్ కుమార్ రెడ్డి,జడ్పి వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, వైస్ ఎంపీపీ జూలకంటి సుధాకర్ రెడ్డి,జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, అపూర్వ ఎండీ ప్రసన్న బాబు, ఆరోగ్య రెడ్డి,సర్పంచ్ పల్లేటి శైలజ నాగయ్య,వేములపల్లి రాజేశ్వరరావు,బాబు నాయక్,ఉప్పల్ రెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *