శ్రవణ్ చదువుకు ఎస్ ఐ కృష్ణయ్య చేయూత

నిరుద్యోగిని ఆదుకున్న లింగాల ఎస్సై కృష్ణయ్య

మహబూబ్ నగర్ , అక్షిత బ్యూరో: నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలోని అవుసలికుంట గ్రామానికి చెందిన వెంకటయ్య కుమారుడు శ్రావణ్ కుమార్ బీఈడీ పూర్తి చేసి 3 సంవత్సరాలు ఐతుంది. అదే సొంత గ్రామంలో పాఠశాలలో విద్య వాలింటర్ గా పని చేసి,ఇప్పుడు ఉచితంగా చెప్పుతూ 2014 నుండి 2020 సంవత్సరం వరకు 55 విద్యార్థులను వివిధ గురుకుల పాఠశాలలకు పరీక్షలు రాయగా ఉత్తీర్ణులయ్యారు, లింగాల ఎస్సై కృష్ణయ్య ముందుకు వచ్చి శ్రావణ్ కుమార్ చాలా మంచి కార్య క్రమాలు ,విద్యార్థులను వివిధ గురుకులలకు పంపించడం చాలా మంచిగా చేస్తున్నాడు . శ్రావణ్ కుమార్ కు జీవనోపాధి కోసం ఎస్సై కృష్ణయ్య ముందుకు వచ్చి 20000/ విలువ గల కంప్యూటర్ ఇప్పించాడు. ఎస్సై ఆర్థిక సహాయం చేయడంతో శ్రావణ్ కుమార్ ఎస్ఐకి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఎస్సైలు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *