విధుల పట్ల అంకిత భావంతో పనిచేయాలి

*ములుగు ఏఎస్పీ సాయి చైతన్య*
*ములుగు,అక్షిత బ్యూరో :
తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ములుగు ఎస్పి డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ సూచనల మేరకు ములుగు సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లల యందు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కేపిఐ మేళా(కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్) ములుగు ఏఎస్పి పోతరాజు సాయి చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించారు.ఇందులో భాగంగా సిబ్బంది యొక్క ఉత్తమ సేవలను గుర్తిస్తూ వారికి ప్రశంసా పత్రాలను మరియు బహుమతులను అందించారు.ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ వర్టికల్ వారీగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందిని ఆదర్శంగా తీసుకొని మిగతా వారు పనిచేయాలని సూచించారు.అలాగే ములుగు సబ్ డివిజన్ లోని పోలీస్ స్టేషన్ ల యందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ గా గుర్తించి వచ్చే ప్రజలకు కనిపించే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు.విధుల పట్ల అంకిత భావంతో పనిచేసే సిబ్బందికి జీ ఎస్ ఈ (గుడ్ సర్వీస్ ఎంట్రీ),ఎం ఎస్ ఈ (మెరిటొరియస్ సర్వీస్ ఎంట్రీ) ఇస్తానని అన్నారు.వరదలు మరియు కరోనా సమయంలో సిబ్బంది అందరూ అత్యుత్తమంగా విధులు నిర్వహించారని కొనియాడారు.అత్యుత్తమంగా పని చేసి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ములుగు జిల్లా పోలీస్ కి మంచి పేరు తీసుకురావాలన్నారు. మొత్తం 22 మంది సిబ్బందికి ఈ ప్రశంసాపత్రాలు అందించారు.ఈ కార్యక్రమంలో పసర సీఐ అనుముల శ్రీనివాస్,ములుగు సీఐ గుంటి శ్రీధర్,ములుగు ఎస్సై లు ఓంకార్ యాదవ్,ఫణీంద్ర, వెంకటాపూర్ ఎస్ఐ రమేష్,తాడ్వాయి ఎస్ఐ వెంకటేశ్వర్లు మరియు పోలీస్ స్టేషన్ ల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *