దున్నపోతు మీద వాన పడినట్లే !

నీటి మూటలా ఎన్నికల హమీ

అక్షిత న్యూస్, పర్వతగిరి : ఎన్నికల హామీల్లో ప్రధానంగా ఓట్లు కురిపించిన బాజు తండా రోడ్లు బురద పొలాలను తలపిస్తున్నాయి. పర్వతగిరి మండలం దౌలత్ నగర్ శివారు బాజు తండాకు వెళ్ళే దారి వరుసగా కురుస్తున్న వర్షాలకు బురద పొలాలుగా మారాయి. గతంలో జరిగిన ప్రతీ ఎన్నికలలో బాజు తండా రోడ్డు విషయం చెప్పి ఓట్లు దండుకున్న నాయకులెవరూ ఇప్పుడు అటువైపు చూడడంలేదు. నిత్యం పర్వతగిరి మండల కేంద్రానికి వెళ్లి వచ్చే తండా ప్రజలకు ఈ రోడ్డును దాటడం నరక ప్రాయంగా మారింది. గత పది సంవత్సరాలుగా ఈ రోడ్డు చెప్పి దొంగ నాయకులు ఓట్లు దండుకు పోతున్నారని, తమ కష్టాలను ఎన్నిసార్లు అధికారులు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినా దున్నపోతుమీద వర్షం కురుస్తున్నట్టె ఉందని తండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *