డా ఎల్ సీ గోపికి సేవా కళా ప్రపూర్ణ

అవార్డు గ్రహీతలందరూ ఆణిముత్యాలే

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
కరోనా విపత్కర పరిస్థితుల్లో విశిష్ట సేవలందించిన పలువురు సువర్ణ కంకణ అవార్డులకు ఎంపికయ్యారు. విద్యుత్ శాఖలో మహేశ్వరం ఏఈగా విధులు నిర్వర్తిస్తూనే నింగి నేల నేను సైతం స్వచ o ద సంస్థతో పేదలకు విశిష్ట సేవలందించిన డా ఎల్ సి గోపయ్య సువర్ణ కంకణ అవార్డుకు ( సేవా కళా ప్రపూర్ణ) ఎంపికయ్యారు. ఆగస్ట్ 1న హైదరాబాద్ లో ఆవార్డ్ ను అందుకోనున్నారు. అవార్డు గ్రహీతలందరూ ఆణిముత్యాలే అని మహేంద్రవాడ వెంకటేశ్వరరావు అన్నారు. “లలితకళా సమాఖ్య సేవా సాంస్కృతిక సంస్థ, శ్రీకృష్ణ సేవా సంస్థాన్ అధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ సంబురాల సువర్ణ కంకణ అవార్డుల సంబరాలును, ఆగస్టు ఒకటవ తారీఖు ఆదివారం హోటల్ సితారలో(బిగ్ బజార్ ప్రక్కన, అమీర్ పేట)హైదరాబాద్ లో జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. అవార్డు గ్రహీతులందరూ “కరోనా దృష్ట్యా అతి తక్కువ మందితో, ఈ కార్యక్రమానికి ఒక గంట ముందుగా రావాలని ఆయన కోరారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి మాస్క్ లు, సానిటైజర్ లతో, తక్కువమందితో సన్మాన కార్యక్రమానికి హాజరుకావాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *