అనాధాశ్రమంలో డాక్టర్ కందుల జన్మ దిన వేడుకలు

ఘనంగా డాక్టర్ కందుల మధు పుట్టినరోజు వేడుకలు
శనగల రాధాకృష్ణ ఆశ్రమంలో డా.మధు పుట్టినరోజు వేడుకలు

కోదాడ, అక్షిత ప్రతినిధి : ఓయు జెఏసి రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కందుల మధు పుట్టిన రోజు వేడుకలను స్థానిక మిత్రబృందం శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆశ్రమంలోని పిల్లలకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ నా జన్మదినాన్ని పురస్కరించుకొని నా మిత్రులు మానసిక వికలాంగుల మధ్య నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఇంత గొప్పగా వేడుకలను ఏర్పాటు చేసిన మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బుర్ర వంశీ, నాని, సత్యం, ఆశిష్ ,కరుణాకర్, కిషోర్, తరుణ్ ,నరసింహ, సాయి, మీసాల ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *