జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు సన్మానం.

తెల్కపల్లి, అక్షిత న్యూస్: మండల పరిధిలోని గౌరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ చంద్రుడు గారు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపికైన సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు అభినందించడం జరిగింది. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ చంద్రుడు గారిని పాఠశాల ఉపాధ్యాయులు , విద్యార్థులు ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ పాఠశాల నుండి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.అలాగే విద్యార్థులకు మంచి విద్యను అందించి ఇంకా మరెన్నో అవార్డులు పొందాలని కోరారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ చంద్రుడు గారు మాట్లాడుతూ విద్యార్థులు కూడా కష్టపడి, ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ చంద్రుడు గారు మరియు ఉపాధ్యాయులు మల్లికార్జున్, లక్ష్మీ నరసింహ రెడ్డి, వెంకటేష్, రామకృష్ణ, రమాదేవి, మధుసూదన్ రెడ్డి, తేజ్య, రంజిత్, కృష్ణయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *