తెల్లరాళ్లపల్లి తండా ప్రగతికి కృషి

తెల్లరాళ్లపల్లి తండాలో నెలకొన్న సమస్యలపై
పర్యటన చేసిన అధికారులు సర్పంచ్

మహబూబ్ నగర్, అక్షిత బ్యూరో : వనపర్తి జిల్లాలోని పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లి తండాలో సోమవారం అధికారులు సర్పంచ్ ఆధ్వర్యంలో తాండ లో వాడ వాడ తిరుగుతూ  సిసి రోడ్లు డ్రైనేజీ భవనం తో పాటు మౌలిక వసతులపై అధికార బృందం పర్యటించి అక్కడ ప్రధాన సమస్యలు  గ్రామ పంచాయతీ భవనం తక్షణమే ఏర్పాటు చేయాలని విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని సిసి రోడ్లు డ్రైనేజీ సమస్యలపై  గ్రామ సభ ద్వారా గుర్తించిన సమస్యలను నివేదిక తయారు చేసి అధికారులను ప్రతిపాదన పంపడం జరుగుతుందని ఆ గ్రామ సర్పంచ్  శాంతమ్మ అన్నారు గుర్తించిన  పనులను అధికారులు స్పందించి పనులు మంజూరు చేయాలని వారు కోరారు , ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శాంతమ్మ , ఉప సర్పంచ్ బుజ్జమ్మ, ఎం  పి ఓ రామస్వామి , మాజీ సర్పంచ్ సోమనాథ్, మహిళా సంఘం అధ్యక్షురాలు చిట్టెమ్మ ,   గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బాల్య నాయక్ , వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *