అభివృద్ది వేదికగా… పల్లె, పట్టణ ప్రగతి

పల్లే , పట్టణ ప్రగతి కార్యక్రమం అభివృద్ధికి వేదిక కావాలి

మెగా పల్లే ప్రకృతివనానికి స్థల పరిశీలన

పల్లే ప్రగతి లో ప్రజలను భాగస్వాములు చేయాలి

ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అందించాలి

నిర్లక్ష్యం పై చర్యలు తప్పవు

విరివిగా మొక్కలు నాటాలి

జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి

సూర్యాపేట, అక్షిత బ్యూరో : పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం అభివృద్ధికి ఒక వేదిక కావాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం నూతనకల్ మండలంలోని మిరియాల గ్రామంలో మెగా పల్లే ప్రకృతి వ నం స్థల పరిశీలన, వైకుంఠ దామాలా పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పల్లే ప్రగతి కార్యక్రమం లో బాగంగా చేపట్టిన పలు పనులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలలో చేపట్టే పలు కార్యక్రమాలకు పల్లే, పట్టణ ప్రగతి కార్యక్రమం ఒక వేదిక కావాలని అన్నారు. ముఖ్యంగా గ్రామపంచాయతీ, పట్టణ వార్డుల వారీగా చేపట్టే పనులలో ప్రజలను ఎక్కువగా భాగస్వాములు చేయాలని సూచించారు. మిరియాల గ్రామంలో మిగిలి ఉన్న వైకుంఠ ధమాం పనులను సత్వరమే పూర్తి చేయాలని అలాగే పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు. హరిత హారంలో విరివిగా మొక్కలు నాటాలని తెలుపుతూ నిర్లక్ష్యం చేసే అదికారులు, సిబ్బంది పై చర్యలు తప్పవని హెచ్చరించారు. రోజువారీ చేపట్టిన పనుల నివేదికలను ఎప్పటికప్పుడు పంపాలని సూచించారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలను అందించాలని తెలుపుతూ వాతావరణం సమతుల్యంగా ఉండాలంటే మొక్కలు తప్పక నాటాలని స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుందని, మొక్కల అవశ్యకత పై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో పది ఎకరాలలో ఏర్పాటు చేసే మెగా నర్సరీ స్థల పరిశీలన అనంతరం ఎంపిడిఓ కు స్థలం అప్పగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కళావతి సంజీవరెడ్డి, ప్రత్యేక అదికారులు, ఉపేంద్ర, మురళి బాబు, ఎంపిడిఓ ఇందిర, కార్యదర్శి అనిల్,ఎంపిఓ మోహన్ రావు,ఏపీఓ శ్రీరాములు, ఆర్. ఐ సుజిత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *