హస్తినలో సీఎం కేసీఆర్

ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, అక్షిత ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీకి చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన కోసం బుధవారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బ‌య‌ల్దేరి వెళ్లిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎంపీలు, నేతలు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం 1.48గంట‌ల‌కు ఢిల్లీ వ‌సంత్ విహార్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యానికి భూమి పూజ చేయ‌నున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న మంత్రులు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌య నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. భూమిపూజ‌ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌స‌భ‌, రాజ్యసభ స‌భ్యులు, పార్టీ నాయ‌కులు పాల్గొనున్నారు. సెప్టెంబ‌ర్ 3న మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌కు సీఎం కేసీఆర్ తిరిగి బ‌య‌ల్దేర‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *