దత్తారం గులాబీ అధ్యక్షులుగా సురేష్ గౌడ్

దత్తారం గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎం. సురేష్ గౌడ్

మహబూబ్నగర్, అక్షిత బ్యూరో : నాగర్ కర్నూలు జిల్లాలోని లింగాల మండల పరిధిలోని దత్తారం గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎం. సురేష్ గౌడ్ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తానని, గ్రామ టిఆర్ఎస్ పార్టీ బలోపేతంకు పాటుపడతానని తెలిపారు, టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు తిరుపతయ్య, సింగిల్ విండో చైర్మన్ హనుమంత్ రెడ్డి , టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రానోజి , గ్రామ టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *