సాధికారిత పేరుతో కొత్త డ్రామా

మూడేళ్లుగా ఎస్ సీ రుణాలు లేవు
దళితుల ఓట్ల గాలానికి కేసీఆర్ ఎత్తులు
మాతంగి చంటి
వేములపల్లి, అక్షిత ప్రతినిధి :
దళిత సాధికారత పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా ఆడుతున్నాడని కాంగ్రెస్ ఎస్ సీ సెల్ వేములపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు మాతంగి చంటి ఆరోపించారు. గురువారం వేములపల్లిలో మీడియాతో మాట్లాడుతూ స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఎస్ సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేసేందని, గత మూడేళ్లుగా దరఖాస్తులు చేసుకున్న వారికి ఇప్పటికి రుణాలు మంజూరు చేయలేదన్నారు. ఆది నుంచి ఏడేళ్లుగా కల్లబొల్లి, గారడి మాటలతో సీఎం కేసీఆర్ ప్రజలను ప్రధానంగా దళితులను నట్టేట ముంచారన్నారు. తెలంగాణ వస్తే చాలు కాపాల కుక్కల ఉంటానని, దళితులకు ముఖ్యమంత్రి పదవంటూ మూడేకరాల భూమి తదితర మాటలు చెప్పి కనీసం మంత్రి పదవులు, నామినేటెడ్ పదవుల్లోనూ దళితులకు మొండి చెయ్యి చూపారన్నారు. హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనిమరో కొత్త డ్రామాకు తెరలేపారని, అన్నీ విషయాలను గమనిస్తున్నారన్నారు. హుజురాబాద్ లో దళితుల గులాబీకి దూరంగా ఉన్నారని ఇంటెలిజన్స్ నివేదిక మేరకు దళిత జపం చేసేందుకు దళిత సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర నాయకులు బొంగర్ల వినోద్, మండల కాంగ్రెస్ నాయకులు దైద గిరి, పగడాల వెంకన్న, పుట్టల పెద్ద వెంకన్న, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *