దళిత బంధు అందరికీ అందేలా చూడాలి

 

తప్పులు దొర్లకుండా,దళిత బంధు పథకం గురించి లబ్ధిదారులకు పూర్తిగా అవగాహన కల్పించాలి

ఇల్లందకుంట మండల ఇంచార్జీ,చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
హుజూరాబాద్, అక్షిత ప్రతినిధి :ఇల్లంతకుంట మండలం టేకుర్తి గ్రామంలో దళిత బంధు సర్వే అధికారులతో కలిసి సర్వేలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. దళిత బంధు పథకం, ముఖ్యమంత్రి కేసిఆర్ ఉద్దేశ్యం లబ్ధిదారులకు తెలియజేయాలని అన్నారు.ఏ ఒక్క లబ్ధిదారుడు తప్పిపోకుండా ప్రతి ఒక్క లబ్ధిదారునికి లబ్ధి చేరే విధంగా సర్వేలో వివరాలు నమోదు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడారు.ముఖ్యమంత్రి కేసీఆర్ బృహత్తరమైన కార్యక్రమాన్ని మొదలు పెట్టారని అన్నారు. దళితులను ధనికులుగా చేసేందుకు దళిత బందును ముఖ్యమంత్రి కెసిఆర్ గారు అమలు చేస్తున్నారని అన్నారు.దళిత బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.దళిత బంధు పథకం ద్వారా యజమానులుగా మారుతున్నారని అన్నారు.గతంలో ఒకరి కింద పని చేసే వ్యక్తి నేడు యజమానిగా మారుతున్నాడు అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *